అమెరికాలో కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. సహాయక బృందంలోని కీలక వ్యక్తికి వైరస్ సోకింది. ఆయన ప్రెస్ సెక్రటరీ, కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. శ్వేతసౌధంలో వారం వ్యవధిలో ఇది రెండో కేసుగా.. పెన్స్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కేటీకి గురువారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలగా.. శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
పెన్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లుగా శ్వేతసౌధం ముందుగానే ప్రకటించినప్పటికీ.. ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బాధితురాలు కేటీగా ధ్రువీకరించారు. ఆమె ఇటీవలి కాలంలో తనను కలిసింది లేదని, కానీ.. ఉద్యోగరీత్యా ఉపాధ్యక్షుడితో కలుస్తుంటారని ట్రంప్ చెప్పారు.
'' కేటీ మంచి యువతి. ఆమెకు అంతకుముందు పరీక్షలు నిర్వహించగా.. ఫలితం సానుకూలంగానే వచ్చింది. కానీ ఉన్నట్టుండి పాజిటివ్‌గా తేలింది.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు