తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు? - కరోనా అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను కరోనా వైరస్ సోకిన పలువురు చట్టసభ సభ్యులు కలిశారని ప్రకటించారు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్. అయితే అధ్యక్షుడికి వైరస్ పరీక్షలు నిర్వహించారా అనే అంశం తనకు తెలియదని పేర్కొన్నారు.

US vice president says doesn't know if Trump tested for coronavirus
ట్రంప్​కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు?

By

Published : Mar 10, 2020, 9:29 AM IST

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ అనేక దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. అమెరికాలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కొంతమంది కరోనా సోకిన చట్టసభ సభ్యులు కలిశారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్​కు కరోనా పరీక్షలు జరిగాయో లేదో తనకు తెలియదని అమెరికా​ ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ పేర్కొన్నారు.

అదే సమయంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్షుడి సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్​తో కొంతమంది చట్టసభ సభ్యులు సన్నిహితంగా మెదిలారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి నుంచి తమకు వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానాలతో.. వారు తమకు తాము గృహ నిర్బంధం విధించుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు అమెరికాలో 600కేసులు నమోదు కాగా.. 25 మంది వైరస్​ బారిన పడి మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details