ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. 'పండుగ అంటే మనలో విభేదాలను పక్కన పెట్టి.. అందరూ ఒక్కటే అని చాటిచెప్పడమే' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"హోలీ శుభాకాంక్షలు. స్నేహితులు, ప్రియమైనవారిపై రంగుల చల్లుకునే పండుగే హోలీ. పండుగ అంటే సానుకూల దృక్పథం కలిగించేది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో విభేదాలను పక్కనబెట్టి, అందరినీ ఏకం చేసి, ఐక్యమత్యాన్ని పెంపొందించాలనే సందేశాన్ని హోలీ ఇస్తుంది."