అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. తన సెనేట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక రాజీనామా పత్రాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌కు సమర్పించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. హారిస్ స్థానంలో కాలిఫోర్నియా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అలెక్స్ పాడిలా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సెనేట్‌కు కమలా హారిస్ రాజీనామా
కమలా హారిస్ తన సెనేట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
సెనేట్‌కు కమలా హారిస్ రాజీనామా
గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు కమల. ఆ పదవిని అధిరోహించేందుకే సెనేట్‌కు రాజీనామా చేశారు. 100 సెనేటర్లు ఉండే అదే సభను త్వరలో అధ్యక్ష హోదాలో నడిపించనున్నారు. తన రాజీనామా.. అమెరికా సెనేట్‌కు వీడ్కోలు వంటిది కాదని, ఇది నూతన స్వాగతమని కమల పేర్కొన్నారు.