తెలంగాణ

telangana

ETV Bharat / international

''ఎఫ్​​-16పై నిశిత దృష్టి'' - balakot

ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని పాకిస్థాన్​ దుర్వినియోగం చేసిందన్న అంశాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది అమెరికా. నిజానిజాలు తెలుసుకోవడంపై దృష్టి సారించింది.

''ఎఫ్​​-16పై నిశిత దృష్టి''

By

Published : Mar 6, 2019, 4:21 PM IST

అమెరికా తయారు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ దుర్వినియోగం చేసిందనే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికలను పరిశీస్తున్నారు.

బాలాకోట్​లో ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన దాడులకు బదులుగా పాకిస్థాన్ యుద్ధ విమానాలతో దాడికి పాల్పడింది. ఇందులో అమెరికాకు చెందిన ఎఫ్​-16 వాడిందని భారత వాయుసేన స్పష్టం చేసింది. క్షిపణి శకలాలను సాక్ష్యాధారాలుగా మీడియా ముందు బయటపెట్టింది.

పాకిస్థాన్​ మాత్రం తాము ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించలేదని వాదిస్తోంది.

ఈ విషయాలపై వస్తోన్న నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని అగ్రరాజ్యం తెలిపింది.

"ప్రస్తుతానికి ఏ విషయాన్ని ఖరారు చేయలేదు. రక్షణ పరమైన ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం నియమాలకు విరుద్ధం. 'ఎఫ్​-16' విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. దానిపైనే దృష్టి సారించాం''
-రాబర్ట్ పల్లాడినో, అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ అధికార ప్రతినిధి

పాంపియో 'దౌత్యం'

భారత్​-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను శాంతింపజేయడంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్​ పాంపియో కీలక పాత్ర పోషించారని తెలిపారు పల్లాడినో.
అలాగే పాక్​ తన భూభాగంలోని ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాలని, వారికి ఎలాంటి నిధులు అందకుండా చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచించింది. దీనిని అమెరికా కూడా సమర్థించిందని రాబర్ట్​ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details