భారత్.. తన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత్ తీసుకువచ్చిన నేపథ్యంలో అగ్రదేశం కీలక ప్రకటన చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో క్యాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
"పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. మత స్వేచ్ఛకు గౌరవం ఇచ్చి, అన్ని మతాలను సమానంగా గౌరవించడం.. మన రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రాథమిక సూత్రాలు. భారతదేశం.. తన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది."- అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి