తెలంగాణ

telangana

ETV Bharat / international

'అఫ్గాన్‌ వదిలి వచ్చేయండి-టికెట్లకు రుణం ఇస్తాం' - తాలిబన్

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల హింస తీవ్రతరమైన నేపథ్యంలో ఆ దేశాన్ని విడిచి, స్వదేశానికి చేరుకోవాలని తమ పౌరులకు సూచించింది అమెరికా. విమాన టికెట్లు కొనేందుకు డబ్బులు లేని వారికి రుణం కూడా అందిస్తామని తెలిపింది.

taliban
అమెరికా

By

Published : Aug 8, 2021, 5:39 AM IST

తాలిబాన్ల హింస పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వెంటనే అఫ్గానిస్థాన్‌ వదిలి, స్వదేశానికి చేరుకోవాలని తమ పౌరులకు అమెరికా విజ్ఞప్తి చేసింది. కాబూల్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయం శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విమాన టికెట్లు కొనేందుకు డబ్బులు లేనివారికి రుణాన్ని అందిస్తామని తెలిపింది. స్థానికంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఇక్కడుంటున్న అమెరికన్లకు కార్యాలయం తరఫున సాయమందించే అవకాశాలు సన్నగిల్లాయని, బెదిరింపులు, హింస కారణంగా.. ఇక్కడ సిబ్బందినీ తగ్గించినట్లు వెల్లడించింది.

ఇప్పటికే కాబూల్ వెలుపల దేశీయ విమాన సర్వీసులు, రోడ్డు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయి.. త్వరలో ఇవీ రద్దయ్యే ప్రమాదం ఉందని యూఎస్‌ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భద్రతా దళాలు అఫ్గాన్‌ను విడిచి వెళ్తున్న దరిమిలా.. స్థానికంగా దేశ సైన్యానికి, తాలిబాన్లకు మధ్య పోరు సాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారాలపై వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ.. తమ దేశం తాలిబాన్ల దురాగతాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అయితే, అమెరికా తన దళాల ఉపసంహరణను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్​ విడిచి వెళ్లండి-పౌరులకు యూకే సూచన

ABOUT THE AUTHOR

...view details