తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో తగ్గిన నిరుద్యోగుల సంఖ్య!

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అక్కడి కార్మిక శాఖ తెలిపింది. నిరుద్యోగ ప్రయోజనాలకు దరఖాస్తు చేసున్నవారి సంఖ్య గత వారం 4,73,000కు పడిపోయిందని, ఇదే నిరుద్యోగుల సంఖ్య తగ్గడానికి నిదర్శనం అని పేర్కొంది. జనవరిలో 9లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

US
అమెరికా

By

Published : May 13, 2021, 10:35 PM IST

నిరుద్యోగ ప్రయోజనాలకు దరఖాస్తు చేసున్నవారి సంఖ్య గత వారం 4,73,000కు పడిపోయిందని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. కరోనా సమయంలో ఇదే అతి తక్కువ అని పేర్కొంది.

అమెరికా కార్మిక శాఖ నుంచి గురువారం వచ్చిన నివేదిక ప్రకారం, వారం ముందు సవరించిన 5,07,000 నుంచి నిరుద్యోగ భృతి దరఖాస్తులు 34,000 తగ్గాయి.

జనవరిలో 9 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా అది తాజాగా 4,73,000కు పడిపోయిందని పేర్కొంది.

టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయడం, మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండడం వల్ల నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:చైనాలో మతపరమైన వివక్షపై అమెరికా ఫైర్

ABOUT THE AUTHOR

...view details