అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ మాత్రం అంగీకరించలేకపోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకా ఓట్ల కౌంటింగ్ పూర్తి కాలేదని.. అన్ని ఓట్లు లెక్కించాక విజయం సాధించేది తానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థను సైతం ట్రంప్ ధూషించారు.
"న్యాయం మనవైపే ఉంది. మనం విజయం సాధిస్తాం.ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేవారం వెలువడతాయి. మరోసారి అమెరికా గొప్పదేశమని నిరూపిద్దాం.''