తెలంగాణ

telangana

ETV Bharat / international

'వాణిజ్య సంబంధాలు బలపడేనా..?'

ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల పరిష్కారానికి వచ్చే వారం.. అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్​లో పర్యటించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ.

వాణిజ్య సంబంధాలు మెరుగయ్యేనా..

By

Published : Jul 5, 2019, 5:53 AM IST

Updated : Jul 5, 2019, 7:43 AM IST

అమెరికా ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధుల బృందం వచ్చే వారం భారత్​లో పర్యటించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య గత కొంత కాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఈ పర్యటన ఉద్దేశించినట్లు పేర్కొంది.

అనంతరం కొన్ని రోజుల్లోనే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ వాషింగ్టన్​కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల విభేదాలను తొలగించడానికి భారీ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు పేర్కొన్నారు.

జీఎస్పీ తొలగింపుతో...

భారత్​కు జీఎస్పీ హోదా తొలగింపు, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచింది. దీనికి ప్రతీకార చర్యగా బాదం, యాపిల్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్​ దిగుమతి సుంకాలు పెంచింది.

వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశాల జాబితా నుంచి అమెరికా... భారత్​ను తొలగించిన కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

సానుకూల సంబంధాలే..

ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నపటికీ.. సంబంధాలు సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​​ కుమార్.

Last Updated : Jul 5, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details