తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆగస్టులో 14 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా వాణిజ్య లోటు - 14 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా వాణిజ్య లోటు

ఆగస్టులో అమెరికా వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నెలలో రికార్డు స్థాయి వాణిజ్య లోటు నమోదైనట్లు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటించింది.

The U.S. trade deficit soared in August
14 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా వాణిజ్య లోటు

By

Published : Oct 7, 2020, 12:48 PM IST

అగ్రరాజ్యం అమెరికా వాణిజ్యలోటు ఆగస్టులో 14 ఏళ్ల గరిష్ఠానికి పెరిగినట్లు అధికారిక గణాంకాల్లో తేలింది.

అమెరికా వస్తు సేవల విక్రయాలు.. విదేశాల నుంచి కొనుగోళ్ల మధ్య అంతరం ఆగస్టులో 5.9 శాతం పెరిగినట్లు ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని విలువ 67.1 బిలియన్ డాలర్లుగా తెలిపింది. ఎనిమిదో నెలలో అగ్రరాజ్యానికి ఈ స్థాయిలో వాణిజ్య లోటు ఏర్పడటం 2006 ఆగస్టు తర్వాత ఇదే ప్రథమం.

ఆగస్టులో ఎగుమతి, దిగుమతులు ఇలా..

అమెరికా ఎగుమతులు ఆగస్టులో 2.2 శాతం పెరిగి.. 171.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు అత్యధికంగా 3.2 శాతం పెరిగి 239 బిలియన్​ డాలర్లుగా నమోదవ్వడం వల్ల వాణిజ్య లోటు భారీగా పెరిగింది.

ఇదీ చూడండి:ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details