కరోనా వైరస్ను 'చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రోడక్ట్'గా అభివర్ణించారు అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో. ఆధారాలు కూడా దొరక్కుండా చైనా ప్రభుత్వమే కావాలని వైరస్ను సృష్టించి ఉంటుందని ఆరోపించారు. వైరస్ మూలాలకు సంబంధించి ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వుహాన్ ల్యాబ్లో, జంతు విక్రయ మార్కెట్లో ఏం జరిగిందనే సమాచారం తెలిస్తేనే వైరస్ ఎలా ఉద్భవించిందనే విషయంపై ఓ అంచనాకు రావచ్చని చెప్పారు నవారో.
చైనీస్ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ పొరపాటున బయటకు వచ్చి ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు నిరాధార ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారాలు. వుహాన్ మార్కెట్ ద్వారానే జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి మొదలైందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు.