కరోనా ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అమెరికాలో వైరస్ మరణ మృదంగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మరణాల జాబితాలో మొదటిస్థానంలో ఉన్న ఇటలీని మించింది అమెరికా. అగ్రరాజ్యంలో ఇవాళ ఒక్కరోజే 1000 మందికిపైగా మృత్యువాతపడినందున.. ఇటలీని దాటి అగ్రస్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 19,827 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 5,08,126కు చేరింది.
కరోనా మృతుల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా
అమెరికాలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కువ వైరస్ మరణాలతో ముందంజలో ఉన్న ఇటలీనీ దాటి 19,827 మందితో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా విషయంలోనూ అగ్రస్థానంలో నిలిచిన అమెరికా
మృతుల జాబితాలో 19,468 మందితో ఇటలీ రెండో స్థానంలో నిలిచింది. ఐరోపాలో కరోనా కేంద్ర బిందువుగా మారిన ఇటలీలో ఇప్పటివరకు 1.61 లక్షల మందికిపైగా వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,06,558 మంది మృతి చెందగా.. 17 లక్షల 30 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
Last Updated : Apr 12, 2020, 1:02 AM IST