కొవిడ్-19తో ధైర్యంగా పోరాడుతున్న భారత్కు అన్నిరకాలుగా సాయం చేసేందుకు అమెరికా నిర్విరామంగా కృషి చేస్తోందని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ స్పష్టం చేశారు. అర్జెంటీనా, జపాన్, నార్వే, దక్షిణాఫ్రికా దేశాలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఇలా వ్యాఖ్యానించారు. వాక్సిన్లకు కావాల్సిన ముడి పదార్థాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లను పంపిస్తున్నామని వివరించారు.
" మా భాగస్వామి భారత్కు సాయం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఇతర దేశాలు సైతం భారత్కు అండగా ఉండేందుకు ప్రోత్సహిస్తాం."
-- లిండా థామస్ గ్రీన్ఫీల్డ్, ఐరాసలో అమెరికా రాయబారి