కరోనాపై పోరు కోసం పాకిస్థాన్‌కు 6 మిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ మెరుగుపరిచేందుకు, వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని పాక్‌కు అమెరికా రాయబారి పాల్ జోన్స్ తెలిపారు. ఫలితంగా కొవిడ్ ప్రభావం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈద్ పండుగ సందర్భంగా పాకిస్థానీలకు శుభాకాంక్షలు తెలిపారు.
పాక్‌కు అమెరికా 6 మిలియన్ డాలర్ల సాయం - us help to pak
పాకిస్థాన్ కరోనాపై పోరాడేందుకు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఈ మొత్తాన్ని ఆరోగ్య కార్యకర్తల శిక్షణ, సదుపాయాల కోసం పాక్ ప్రభుత్వం వినియోగించనుంది.
పాకిస్థాన్‌కు అమెరికా 6 మిలియన్ డాలర్ల సాయం
అమెరికాకు ఇటీవల ఔషధాలు సరఫరా చేసినందుకు పాక్‌కు కృతజ్ఞతలు చెప్పారు జోన్స్. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు.
పాక్‌లో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంతో తమ వంతు సాయంగా మొత్తం 21 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.