ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి నుంచి రక్షించడంలో అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తోంది దీనిలో భాగంగా.. 50 కోట్ల ఫైజర్ టీకా డోసులు కొనుగోలు చేయనుంది. 92 పేద దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా అందించనుంది.
కొవాక్స్ కూటమి..
వచ్చే ఏడాది వ్యవధిలో కొవాక్స్ కూటమి ద్వారా ఈ టీకాలు అందజేయనుంది. జీ7 దేశాల సదస్సుకు ముందు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌథ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాదిలో 10 కోట్ల మంది కోసం 20 కోట్ల డోసులు సరఫరా చేయనుండగా.. వచ్చే ఏడాదిలో మిగిలిన 30 కోట్ల డోసులు అందించనున్నట్లు తెలిపాయి.
ఇదే ప్రజాస్వామ్యం..
ప్రజలకు ఎల్లప్పుుడూ సేవ చేయటంలో ప్రజాస్వామ్య దేశాలే ముందుంటాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ తెలిపారు. కరోనాను అంతం చేసే ఆయుధసామాగ్రి (వ్యాక్సిన్లు) అమెరికా వద్దే ఉందన్నారు.
ఇదీ చదవండి :'మేం కలిసే ఉన్నాం... రష్యా, చైనా గుర్తించాలి!'