ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో తాము పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓకు అమెరికా రాంరాం - డబ్ల్యూహెచ్ఓకు అమెరికా రాంరాం
కరోనా మహమ్మారి విషయంలో కొద్ది రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డబ్ల్యూహెచ్ఓతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓకు అమెరికా రాంరాం
ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఆయన శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు ట్రంప్. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
డబ్ల్యూహెచ్ఓకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ చెప్పారు.