తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యంలో 25 అడుగుల అంజన్న విగ్రహం - Latest Hanuman statue in US

అమెరికాలో అతిపెద్ద హనుమాన్​ విగ్రహాన్ని త్వరలోనే డెలవేర్​లోని ఓ ఆలయంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు.

US' tallest Hanuman statue built in Delaware
అమెరికాలో అతిపెద్ద హనుమాన్​ విగ్రహం ఏర్పాటు!

By

Published : Jun 14, 2020, 3:53 PM IST

అమెరికాలోనే అతిపెద్ద హనుమాన్​ విగ్రహాన్ని రూపొందించింది హిందూ దేవాలయాల సంఘం. డెలవేర్ రాష్ట్రం హాకెసిన్​లో ప్రతిష్టించేందుకు ఏర్పాటు చేస్తోంది. అయితే.. కరోనా కారణంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండానే సాధారణ ఏర్పాట్లతో విగ్రహ ప్రతిష్ట చేయనున్నట్లు స్పష్టం చేశారు సంఘం సభ్యులు. 25 అడుగుల ఎత్తైన హనుమాన్​ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

25 అడుగుల ఎత్తైన హనుమాన్​ ప్రతిమ

'నల్లటి గ్రానైట్​ రాయితో హనుమాన్​ విగ్రహాన్ని చెక్కారు. ప్రతిమ పూర్తి రూపం దాల్చేందుకు సుమారు ఏడాది సమయం పట్టింది. విగ్రహం పూర్తయిన తర్వాత ఆలయానికి అందిస్తాం. ఆలయ పూజారులు 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.'

- పాటిబంద శర్మ, హిందూ ఆలయాల సంఘం అధ్యక్షుడు

డెలవేర్​ రాష్ట్రంలో న్యూక్యాజిల్​ హోలీ స్పిరిట్​ చర్చిలోని 'ఔర్ లేడీ క్వీన్​ ఆఫ్​ పీస్'​ విగ్రహం అతి పెద్దదిగా తొలి స్థానంలో ఉండగా.. త్వరలోనే ప్రతిష్టించనున్న హనుమాన్​ విగ్రహం రెండో స్థానంలో నిలువనుంది.

ఇదీ చదవండి:భగవద్గీతతో ప్రశాంతత: గబార్డ్‌

ABOUT THE AUTHOR

...view details