భారత్- చైనా సరిహద్దు వివాదంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత సార్వభౌమాధికారానికి చైనా పదేపదే సమస్యలు తెచ్చిపెడుతోందని.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ మిత్రదేశానికి అండగా ఉంటామని మాజీ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ (పీడీఏఎస్) ఎలైస్ జీ వెల్స్ తెలిపారు.
చైనాతో వివాదంలో భారత్‌కే మా పూర్తి మద్దతు: అమెరికా - భారత్‌కు అండగా అమెరికా
భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తూ చైనా పదేపదే సమస్యలను సృష్టిస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో వాటిని తిప్పికొట్టడానికి భారత్‌కు అమెరికా ఎల్లప్పుడూ సహాయం చేస్తుందని పేర్కొన్నారు అమెరికా పీడీఏఎస్ ఎలైస్ జీ వెల్స్.
చైనా విషయంలో భారత్‌కు మా పూర్తి మద్దతు: అమెరికా
యూఎస్-ఇండియా దోస్తీ, ఇండియా.. అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ట్వీట్‌తో పాటు జోడించారు వెల్స్.
మే నెలలో భారత్-చైనా దళాల మధ్య నెలకొన్న ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమస్యను పరిష్కరించడం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ ప్రతిపాదనను భారత్-చైనా తిరస్కరించాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల అధికారులు ఇప్పటికే సమావేశమయ్యారు.