భారత సంతతి అమెరికన్ అయిన వ్యోమగామి కల్పనా చావ్లాకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె పేరు పెట్టిన అంతరిక్ష నౌక.. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. అమెరికా ఏరోస్పేస్ సంస్థ నార్తోర్ప్ గ్రుమన్ తయారు చేసిన ఈ అంతరిక్ష నౌకను.. వర్జీనియా తీరంలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ కేంద్రం నుంచి ప్రయోగించారు.
ఎస్ఎస్ కల్పనా చావ్లా అంతరిక్ష నౌక.. 360 డిగ్రీల కోణంలో స్పేస్ వాక్‌ను చిత్రించే కెమెరాను తీసుకెళ్తోంది. అంతరిక్షంలో పండించడానికి అవసరమైన ముల్లంగి విత్తనాలు, మాంసం వంటి ఆహార పదార్థాలను మోసుకొని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది.