అమెరికాను బాంబ్ తుపాను వణికిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులు అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మంచు సెంటీమీటర్ల మేర పేరుకుపోయింది. రవాణా, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. అనేక విమానసర్వీసులు రద్దయ్యాయి.
బాంబ్ తుపానుతో అమెరికా గజగజ - విద్యుత్ వ్యవస్థ
'బాంబ్ సైక్లోన్' అమెరికాపై పెనుప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దక్షిణ డకోటాలో రికార్డు స్థాయిలో 45.7 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు అధికారులు.
అమెరికాలో మంచు తుపాను బీభత్సం
దక్షిణ డకోటాలో 45 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. హిమాన్ని తొలగించడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. మిన్నెసొటా, నెబ్రాస్కా, దక్షిణ డకోటాలో పాఠశాలలకు రెండోరోజూ సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలూ కార్యకలాపాలకు నోచుకోలేదు.
Last Updated : Apr 12, 2019, 1:00 PM IST