తెలంగాణ

telangana

ETV Bharat / international

వేలంపాటకు 'మూన్​ షూ': ధర $ 1.6 లక్షలు

అమెరికా సదబీస్​ సంస్థ న్యూయార్క్​లో తొలిసారి అరుదైన స్నీకర్స్ ​(షూ) ప్రదర్శన ఏర్పాటు చేసింది. ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 100 రకాల అరుదైన బూట్లను వేలంపాటకు ఉంచారు. నైక్ సంస్థ రూపొందించిన పాపులర్​ 'మూన్​ షూ' ధర 1,60,000 డాలర్లు పలుకుతుందని అంచనా.

వేలంపాటకు 'మూన్​ షూ': ధర $ 1.6 లక్షలు

By

Published : Jul 14, 2019, 8:02 AM IST

వేలంపాటకు 'మూన్​ షూ': ధర $ 1.6 లక్షలు

ఈ గదిలో కనిపిస్తున్న బూట్లు చాలా అరుదైనవి. నైక్ సహా ప్రముఖ బ్రాండ్​లకు చెందిన దాదాపు 100 రకాల స్నీకర్స్​ను వేలంపాట కోసం ప్రదర్శనలో ఉంచారు. అమెరికా ప్రముఖ వ్యాపార సంస్థ 'సదబీస్' తొలిసారి ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేసింది.

నైక్​ సంస్థ సహ వ్యవస్థాపకులు బిల్ బోవర్​మన్​ స్వయంగా రూపొందించిన 'మూన్​ షూ' ఈ వేలంపాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 1972 ఒలింపిక్స్ ట్రయల్స్​ కోసం వీటిని తయారు చేశారు బిల్​.

బిల్​ బొవెర్​మన్​ రూపొందించిన 'మూన్​ షూ'ను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాము. ఇలాంటి స్నీకర్స్ మీరు ఎక్కడా చూడలేరు. వీటిని 80 వేల డాలర్ల ప్రారంభ ధరతో వేలంపాటలో ఉంచాము. వీటి ధర 1.6 లక్షల డాలర్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నాం.

-నోహ్ వంచ్​, సదబీస్​ ఈకామర్స్​ హెడ్​

ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'బ్యాక్​ టు ఫ్యూచర్' మోడల్​ షూను 2011, 2016లో ప్రత్యేక కార్యక్రమం కోసం తయారు చేశారు.​ ఈ రెండు జతల షూ ప్రదర్శనలో ఉంచారు.
అమెరికా పాపులర్​ బేస్​బాల్​ క్రీడాకారుడు డెరెక్ జెటర్స్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 40 జతల స్నీకర్స్​నూ వేలంపాటలో అందుబాటులో ఉంచారు. వీటి ధర 30వేల డాలర్లు.

జులై 11 న ప్రారంభమైన ఈ ప్రదర్శన జులై 23 వరకు కొనసాగనుంది.

ఇదీ చూడండి: బాలుడ్ని రేప్​ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details