తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో నలుగురు భారతీయులు హత్య

అమెరికా ఒహాయోలోని సిన్సినాటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన భారతీయులు.

By

Published : May 1, 2019, 1:16 PM IST

Updated : May 1, 2019, 2:27 PM IST

అమెరికాలో కాల్పులు- నలుగురు భారతీయుల మృతి

అమెరికాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారత జాతీయులు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటన ఒహాయోలోని సిన్సినాటీలో జరిగింది.

'నా భార్య మరో ముగ్గురు నేలపై పడి ఉన్నారు. వారి తల నుంచి రక్తం కారుతోంది. ఎవరూ మాట్లాడటం లేదు' అన్న ప్రాథమిక సమాచారం తమకు అందిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్ని 59 ఏళ్ల హకీకత్ సింగ్ పనాగ్, ఆయన భార్య పరమ్​జీత్ కౌర్, వారి కుమర్తె శైలిందర్ కౌర్, మరో కుటుంబసభ్యురాలు అమర్​జీత్ కౌర్​గా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.50 నిమిషాలకు ఘటన జరిగిందని పోలీసులు నిర్ధరించారు.

భోజనాలకు సిద్ధమవుతుండగా...

వారిలో ఒకరు ఆహారాన్ని సిద్ధం చేస్తుండగా దుండగుడి కాల్పులకు బలయ్యారు. స్టవ్​పై ఉడుకుతున్న ఆహారాన్ని సంఘటన స్థలంలో గమనించామని పోలీసులు వెల్లడించారు.

భారత దౌత్య కార్యాలయం ప్రకటన

ఘటనపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించింది భారత దౌత్య కార్యాలయం. మృతుల కుటుంబాలకు సానుభుతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

"మృతుల కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. కుటుంబ సభ్యులతో, పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నేరం చేసిందెవరైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే."

-భారత దౌత్య కార్యాలయం ట్వీట్.

సుష్మాస్వరాజ్ స్పందన

విదేశాంగ శాఖమంత్రి ఈ ఘటనపై స్పందించారు. విద్వేషపూరిత దాడి అని అనుకోవట్లేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జుట్టు వయసు 75 ఏళ్లు... పొడవు 15 అడుగులు

Last Updated : May 1, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details