ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితంఅమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చడం.. ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమైంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందంటూ ట్రంప్ ప్రకటించడం మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది.
గురువారం అంతర్జాతీయ సముద్ర జలాల్లోని హర్మోజ్ జలసంధి వద్ద గస్తీ కాస్తోన్న 'యూఎస్ఎస్ బాక్సర్' నౌక.. సుమారు 1000 గజాల దూరంలో ఇరాన్ డ్రోన్‌ను గమనించింది. పలు మార్లు హెచ్చరించినా డ్రోన్‌ను ల్యాండ్ చేయకపోవడం వల్ల కూల్చివేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
"డ్రోన్‌ను వెనువెంటనే కూల్చేశాం. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న నౌకలపై ఇరాన్ జరిపే రెచ్చగొట్టే చర్యల్లో ఇదీ ఒకటి. మా నౌకకు ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా మేం రక్షణాత్మక వైఖరితో దాడి చేశాం. మిగిలిన దేశాలూ జలసంధి వద్ద ఉన్న వారి నౌకలను జాగ్రత్తగా చూసుకోవాలి." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఖండించిన ఇరాన్...