తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒప్పందం కుదిరింది.. ట్రంప్​ 'ప్యాకేజీ' గట్టెక్కింది! - కరోనా వైరస్​ అమెరికా

ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనేట్​-శ్వేతసౌధం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్యాకేజీ సెనేట్​లో గట్టెక్కనుంది. కరోనాపై పోరు సహా అమెరికా ప్రజలను విపత్తు నుంచి రక్షించడానికి ఈ ప్యాకేజీపై ట్రంప్​ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

US Senate, White House agree on USD 2 trillion rescue for virus-hit US economy
ఒప్పందం కుదిరింది.. ట్రంప్​ 'ప్యాకేజీ' గట్టెక్కింది!

By

Published : Mar 25, 2020, 2:11 PM IST

కరోనా వైరస్​పై పోరుకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రతిపాదించిన 2 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఎట్టకేలకు గట్టెక్కనుంది. ఐదు రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం ఇందుకోసం సెనేట్​- శ్వేతసౌధం మధ్య ఓ ఒప్పందం కుదిరింది.

"మేము ఓ ఒప్పందానికి వచ్చాం. ఈ ఆర్థిక ప్యాకేజీ దేశ చరిత్రలోనే ఎంతో పెద్దది. చాలా మంది ప్రజలు ఎలాంటి తప్పుచేయనప్పటికీ.. వారి ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో వారికి తెలియదు. బిల్లులు ఎలా కడతారో ఆర్థం కావడం లేదు. వారిని ఆదుకోవడానికి మేము వచ్చేస్తున్నాం."

--- మిచ్​ మెక్​కాన్నెల్​, సెనేట్​ సభ్యుడు.

కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా, విపత్తు నుంచి అగ్రరాజ్య ప్రజలను గట్టెక్కించడానికి ట్రంప్​ 2 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రతిపాదించారు​.

ఇప్పటికే దిగువ సభలో బిల్లును ఒకసారి ప్రవేశపెట్టగా.. డెమొక్రాట్ల మద్దతు లభించకపోవడం వల్ల అది వీగిపోయింది. తాజా ఒప్పందం అనంతరం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఈ బిల్లు మరోమారు సెనెట్​ వద్దకు రానుంది. సెనేట్​లోని 60 మంది మద్దతు అవసరం. ఇక్కడ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఎగువ సభలో ప్రవేశపెడతారు. తర్వాత ఈ చట్టాన్ని అమలు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం అవసరం.

ABOUT THE AUTHOR

...view details