తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయులకు శుభవార్త- కీలక బిల్లుకు సెనేట్​ ఆమోదం - ఇమ్మిగ్రెంట్​ వార్తలు

ఇమ్మిగ్రెంట్​ వీసాలకు సంబంధించిన కీలక బిల్లుకు అమెరికా సెనేట్​ ఆమోదం పలికింది. దేశాలవారీగా వలసదారుల ఉద్యోగ నియామకాలపై ఉన్న సంఖ్యాపరమైన పరిమితిని ఎత్తివేసేందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు.

US Senate passes bill
కీలక బిల్లుకు సెనేట్​ ఆమోదం- భారతీయులకే లాభం!

By

Published : Dec 3, 2020, 11:33 AM IST

కీలక వలస సంస్కరణల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేసింది. అమెరికాలో ఉన్న వందలాది మంది భారతీయ ఉద్యోగులకు ఈ బిల్లు ప్రయోజనం చేకూర్చనుంది. సదరు బిల్లును సెనేట్​ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం.

బిల్లులో ఏముంది?

  1. దేశాలవారీగా వలసదారులకు ఇచ్చే వీసాలపై ఉన్న సంఖ్యాపరమైన పరిమితిని ఈ బిల్లు ఎత్తివేసింది.
  2. కుటుంబ పరమైన వీసాల సంఖ్యను పెంచుతుంది.

ఎవరికి లాభం..?

ఈ హై-స్కిల్డ్​ ఇమ్మింగ్రెంట్స్​ యాక్ట్ వల్ల యూఎస్​లో పనిచేస్తోన్న భారత ఐటీ ఉద్యోగులకు ఎంతో లాభం చేకూరనుంది. హెచ్​1బీ వీసాలు తీసుకుని గ్రీన్​కార్డ్​ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్నవారి నిరీక్షణ ఫలించనుంది.

ABOUT THE AUTHOR

...view details