అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా బుధవారం నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి భారత సంతతి అమెరికన్ ఆమె కావడం విశేషం.
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా - వనితా గుప్తా
మరో భారత సంతతి అమెరికన్‌కు అక్కడ ఉన్నత పదవి లభించింది. యూఎస్ సెనేట్‌లో అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా బుధవారం నియమితులయ్యారు.
Vanita Gupta, Associate Attorney General
న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు వనితను ఎంపిక చేశారు. ఓటింగ్‌లో రిపబ్లికన్ నేత, సెనెటర్ లీసా మర్కోస్కీ మద్దతు పలకగా 51-49 స్వల్ప ఆధిక్యంతో వనిత విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో న్యాయవిభాగంలో పనిచేసిన అనుభవం వనిత గుప్తా సొంతం.
ఇదీ చూడండి:బ్రిటన్ బృందంలో సౌమ్య స్వామినాథన్‌కు చోటు