భారత్‌లో తయారైన 23 వేలకు పైగా సిల్డెనాఫిల్ సిట్రేట్ మాత్రలను అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వయాగ్రా ట్యాబ్లెట్ల తయారీలో ఈ డ్రగ్‌నే ప్రధానంగా ఉపయోగిస్తారు. సీజ్ చేసిన ట్యాబ్లెట్ల రిటైల్ విలువ రూ.5.30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
సుమారు 20 కేజీల బరువైన పిల్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బ్లిస్టర్ ప్యాకింగ్ చేశారు. జార్జియా, డెకాటర్లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు డ్రగ్స్‌ను తరలిస్తున్నారు. భారత్‌లోని ఓ అపార్ట్మెంట్ నివాసం నుంచి వీటిని పంపినట్లు గుర్తించారు.