తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2019, 3:05 PM IST

ETV Bharat / international

అమెరికా ఆరా..!

భారత్​పై వైమానిక దాడిలో పాకిస్థాన్​ 'ఎఫ్​-16' యుద్ధ విమానాలను ఉపయోగించడంపై అమెరికా ఆరా తీస్తోంది. పాక్ చర్య 'ఎఫ్​-16' యుద్ధ విమానాల "కొనుగోలు ఒప్పందాని"కి విరుద్ధమనే అంశాన్ని పరిశీలిస్తోంది.

పాక్​ చేస్తున్న​ 'ఎఫ్​-16' యుద్ధ విమానాల దుర్వినియోగంపై అమెరికా ఆరా!

భారత సైనిక స్థావరాలపై బుధవారం దాడికి యత్నించి భంగపడ్డ పాకిస్థాన్‌ ఈ కుట్రలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఉపయోగించలేదని బుకాయిస్తుంది. దీనిపై అమెరికా ఆరా తీస్తోంది. దాడికి పాక్‌ ఉపయోగించిన ఓ ఎఫ్‌-16ను కూల్చివేసినట్లు భారత అధికారులు చేసిన ప్రకటనను పాక్‌ తోసిపుచ్చింది.

ఇవిగో ఆధారాలు..

పాక్​ బుకాయింపు ప్రకటనలపై స్పందించిన భారత్​ ఎఫ్​-16 యుద్ధ విమానాల శకలాలను, ఆధారాలతో సహా బయటపెట్టింది. పాక్​ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్​-16 ద్వారా మాత్రమే ప్రయోగించగల అమ్రామ్​ క్షిపణి శకలాలను భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు గురువారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ విషయంపై అమెరికా మరింత సమాచారాన్ని సేకరిస్తోంది.

ఇదీ ఒప్పందం

పాక్​కు ఎఫ్​-16 యుద్ధ విమానాలను రక్షణ కొనుగోళ్లలో భాగంగా అమెరికా సరఫరా చేసింది.

"పాకిస్థాన్​ ఈ అధునాతన ఎఫ్-16 యుద్ధ విమానాలను కేవలం ఉగ్రవాదంపై పోరాడేందుకు, విద్రోహశక్తులను అణిచివేసేందుకు మాత్రమే ఉపయోగించాలి. " _పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ అండ్​ కోఆపరేషన్​ ఏజెన్సీ

ఉగ్రవాదం, విద్రోహశక్తులను అణచివేసేందుకు మాత్రమే వాటిని ఉపయోగిస్తామని 'కొనుగోలు ఒప్పందం'పై పాక్​ సంతకం చేసింది. ఉద్రిక్తతలు పెంచేలా ఏ దేశంపైకీ వాటిని ప్రయోగించబోమని హామీ ఇచ్చింది. అయితే ఈ ఒప్పందాన్ని పాక్​ తుంగలో తొక్కుతూ భారత్​పైకి ఎఫ్​-16 యుద్ధవిమానాలను పంపించింది.

ఇకపై కష్టమే

ఈ విషయం రూఢీ అయితే ఇకపై అమెరికా నుంచి పాక్ నూతన రక్షణ ఉత్పత్తుల కొనుగోలు కష్టసాధ్యమవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా అమెరికా ఎఫ్​-16 యుద్ధ విమానాలను పాక్ ఉపయోగించడంపై సుమారుగా ఓ డజను పరిమితులను విధించినట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details