తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇరాన్ కట్టుబడి ఉంటే అణు ఒప్పందంలోకి అమెరికా' - ఇరాన్ అణు ఒప్పందంపై బైడెన్​

అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్​ చైనా, ఇరాన్​, అఫ్గానిస్థాన్​ దేశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు ఇరాన్​ కట్టుబడి ఉంటేనే అణు ఒప్పందంలో అమెరికా తిరిగి చేరుతుందని స్పష్టం చేశారు. చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

iran nuclear deal, us
ఇరాన్ కట్టుబడి ఉంటేనే అణు ఒప్పందంలో చేరిక

By

Published : Jan 28, 2021, 11:14 AM IST

ఇరాన్​ అణు ఒప్పందంలో తిరిగి చేరేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పంద నిబంధనలకు ఇరాన్​ కట్టుబడి ఉంటేనే ​అణు ఒడంబడికలోకి అమెరికా తిరిగి చేరుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్​ బుధవారం స్పష్టం చేశారు. అలా చేస్తే అమెరికా.. ఇరాన్​తో బంధం బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. కానీ ఇరాన్​ అనేక అంశాల్లో నిబంధనలు ఉల్లంఘిచిందని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్​ నిబంధనలకు అంగీకరిస్తే నిపుణుల మార్గదర్శకత్వంలో తదుపరి కార్యచరణకు అడుగులు వేస్తామని బ్లింకన్ తెలిపారు.

అఫ్గాన్​తో..

అఫ్గానిస్థాన్​లోని అమెరికా రాయబారి జాల్మయ్​ ఖలీల్​జాద్​ను​ శాంతిచర్చలు గతంలోలాగే కొనసాగించాలని బైడెన్ ప్రభుత్వం కోరినట్లు ఆ దేశ ఉన్నతస్థాయి దౌత్యవేత్త తెలిపారు. తాలిబన్లతో ఒప్పందాన్ని కూడా సమీక్షించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్​ తెలిపారు. ఒప్పందంలో ఏముందో తెలుసుకునేందుకే ఈ సమీక్ష అని వెల్లడించారు.

చైనాతో బంధం..

వాతావరణ మార్పు, పర్యావరణం పరిరక్షణ వంటి అంశాలతో పాటు కీలక విషయాల్లో చైనాతో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని బ్లింకన్​ అభిప్రాయపడ్డారు. చైనా అమెరికాల మధ్య బంధం ప్రస్తుతం ప్రపంచంలోనే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. చైనాతో ఉన్న సమస్యలపై కూడా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :'న్యూ స్టార్ట్​' డీల్​కు రష్యా పార్లమెంట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details