Us secretary of defence corona positive: అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా.. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు కరోనా సోకింది.
అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్ - అమెరికా రక్షణ మంత్రికి కరోనా
Us secretary of defence corona positive: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు కరోనా నిర్ధరణ అయింది. కొవిడ్ టీకా బూస్టర్ డోసు కూడా తీసుకున్నప్పటికీ ఆయన కరోనా బారినపడ్డారు.
![అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్ Us secretary of defence corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14078598-thumbnail-3x2-covid.jpg)
అమెరికా రక్షణ మంత్రికి కరోనా
"లక్షణాలు కనపించగా పరీక్షలు చేయించుకున్నాను. అందులో కొవిడ్ సోకినట్లు తేలింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వైద్యుల సలహాను పాటిస్తున్నాను" అని ఆస్టిన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆస్టిన్ కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రెండు డోసుల కొవిడ్ టీకా డోసుతో పాటు బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ ఆస్టిన్ కరోనా బారినపడడం గమనార్హం.