తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్(Afghanistan news) నుంచి తమ ప్రజలను తరలించే ప్రక్రియను ఆగస్టు 31నాటికి పూర్తి చేయడంపై దృష్టి సారించామని అమెరికా అధికారులు(America Afghanistan) తెలిపారు. అయితే.. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేతసౌధం, విదేశాంగ శాఖ, పెంటాగన్(రక్షణ విభాగం) అధికారులు తెలిపారు.
"కాబుల్ విమానాశ్రయంలో(Kabul airport) ప్రస్తుతం 5,800 బలగాలు ఉన్నాయి. అమెరికా వాసులను, అఫ్గాన్‌లో 20 ఏళ్లుగా అమెరికాకు సాయం చేసిన అఫ్గాన్ పౌరులను వెనక్కి రప్పించేందుకు వారు సాయం చేస్తున్నారు. అమెరికా నుంచి సాధ్యమైనంత స్థాయిలో మేము పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నామని అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని అఫ్గాన్ నుంచి తరలించాము. రానున్న రోజుల్లోనూ ఇంతే సమర్థవంతంగా మేము ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ ప్రక్రియను కొనసాగించడంపై అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారు."
-జేక్ సులివాన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు.
ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని తాలిబన్లు చేస్తున్న డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిబ్రీ తెలిపారు. వాటిని తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. ప్రస్తుతం తాము ఈ నెలాఖరులోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు.
ఈ తరలింపు ప్రక్రియను ఎప్పుడు ముగించాలన్న దానిపై అధ్యక్షుడు బైడెన్‌దే(US President Biden) తుది నిర్ణయమని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలను సురక్షితంగా వెనక్కు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. గత 24 గంటలుగా తాము భారీ సంఖ్యలో ప్రజలను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
తాలిబన్లతో చర్చిస్తున్నాం..