తెలంగాణ

telangana

ETV Bharat / international

సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ! - coronavirus vaccine usa pfizer

అగ్రరాజ్యం ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. అమెరికా మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్​ను సోమవారం ఉదయం నుంచి అక్కడి ప్రజలుకు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

US says COVID-19 vaccine to start arriving in states Monday
సోమవారం నుంచే అమెరికాలో టీకా పంపిణీ

By

Published : Dec 13, 2020, 5:31 AM IST

Updated : Dec 13, 2020, 6:16 AM IST

కరోనాతో విలవిల లాడుతున్న అమెరికాకు శుభవార్త చెప్పారు అక్కడి అధికారులు. సోమవారం నుంచి కొవిడ్​కు సంబంధించిన ఫైజర్​ వ్యాక్సిన్​ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రముఖ బట్వాడా కంపెనీలు అయిన యూపీఎస్, ఫెడెక్స్​ల ద్వారా టీకా పంపిణీ చేస్తామని ఆర్మీ జనరల్ గుస్టావ్ ఎఫ్. పెర్నా శనివారం తెలిపారు.

టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ట్రంప్​ సర్కార్​ సోమవారం ఉదయం అందరికీ టీకా ఇవ్వనుంది. అందుకు తగ్గట్టుగా ఆరోగ్యశాఖ కార్యకర్తలు డోసులు ఇవ్వడం ప్రారంభిస్తారని పెర్నా చెప్పారు. మంగళ, బుధవారం మరో 450 ప్రాంతాలకు టీకా అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం

Last Updated : Dec 13, 2020, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details