తెలంగాణ

telangana

ETV Bharat / international

ముగ్గురు చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు - అమెరికా ఆంక్షలు

కొవిడ్​-19 పై ఇప్పటికే చైనాపై ట్రంప్​ మండిపడుతున్న వేళ.. అగ్రరాజ్యం మరో నిర్ణయం తీసుకుంది. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్​ అధికారులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.

US sanctions Chinese officials over repression of minorities
ముగ్గురు చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు

By

Published : Jul 10, 2020, 7:57 AM IST

కరోనా విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శల దాడి కొనసాగిస్తున్న నేపథ్యంలో.. అగ్రరాజ్యం మరో నిర్ణయం తీసుకుంది. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్‌ అధికారులను తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా ఆంక్షలు విధించింది. చైనాలో మతపరమైన మైనార్టీలపై కమ్యూనిస్టు పార్టీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

'చైనాలో కమ్యూనిస్టు పార్టీ మైనార్టీ మతస్తులపై కొనసాగిస్తున్న వ్యవస్థీకృత అరాచకాలపై చర్యలు తీసుకుంటున్నాం. ఝింజియాంగ్‌ ప్రాంతంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ద్వారా ముస్లింల సంస్కృతిని, విశ్వాసాలను తుడిచేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఈ విషయాలను అమెరికా చూస్తూ ఊరుకోదు.'

- మైక్‌ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

ఆ అధికారులెవరంటే.?

అమెరికా నుంచి నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఝింజియాంగ్‌ ప్రాంత కార్యదర్శి చెన్‌ క్వాంగో, ఝింజియాంగ్‌ ప్రాంత రాజకీయ, న్యాయ కమిటీ కార్యదర్శి ఝు హైలన్‌, ఝింజియాంగ్‌ ప్రజాభద్రత శాఖ కార్యదర్శి వాంగ్‌ మింగ్‌షన్‌ ఉన్నారు.

వారితో పాటు..

ఫలితంగా వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించే వీలు లేదు. ఇతర అధికారులకూ మానవ హక్కుల ఉల్లంఘనతో సంబంధమున్నట్లు తేలితే వారిపైనా ఆంక్షలు విధిస్తామని పాంపియో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'గాలిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి- కానీ..'

ABOUT THE AUTHOR

...view details