తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆకస్'​ కూటమిలోకి భారత్​- అమెరికా ఏమందంటే? - చైనా

ఇండో- పసిఫిక్​ ప్రాంత భద్రత కోసం ఇటీవల ఏర్పాటు చేసిన 'ఆకస్​' కూటమిలో(aukus alliance) భారత్​ చేరనుందా? చైనాకు చెక్​ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలతో జట్టుకట్టనుందా? భారత్​ చేరికపై అగ్రరాజ్యం సమాధానం ఏమిటి?

US rules out adding India
'ఆకస్'​ కూటమిలోకి భారత్​

By

Published : Sep 23, 2021, 11:00 AM IST

ఇండో పసిఫిక్​ ప్రాంతంలో(indo pacific region) భద్రతా భాగస్వామ్యం కోసం ఆస్ట్రేలియా, యునైటెడ్​ కింగ్​డమ్​లతో కలిసి ఇటీవల ఏర్పాటు చేసిన కూటమి 'ఆకస్​'లో(aukus alliance) భారత్​ లేదా జపాన్​ను చేర్చుకోవటాన్ని తోసిపుచ్చింది అమెరికా. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అలాగే.. ఈ కూటమిపై ఫ్రాన్స్​ ఆరోపణలను సైతం తిప్పికొట్టింది.

అమెరికాలో తొలిసారి నేరుగా క్వాడ్​ సమావేశం(quad summit 2021) జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరుకానున్న భారత్​, జపాన్​ వంటి దేశాలను కొత్త కూటమిలో(aukus alliance) చేర్చుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ జాన్​ సాకీ.

" గత వారం ప్రకటించిన ఆకస్​ కూటమి కేవలం ఒక సంకేతం కాదు. ఇండో పసిఫిక్​ ప్రాంతం భద్రతలో పాల్గొనేవారు మరెవరూ లేరని చెప్పే సందేశం. ఈ సందేశాన్ని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్​ మెక్రాన్​కు సైతం అధ్యక్షుడు బైడెన్​ తెలిపారని భావిస్తున్నా. నిజానికి ఇది ఫ్రాన్స్​తో మాట్లాడేందుకు ముఖ్యమైన అంశం. "

- జెన్​ సాకీ, శ్వేతసౌధం ప్రెస్​ సెక్రెటరీ.

ఇండో పసిఫిక్​ ప్రాంతంలో(indo pacific region) చైనాకు చెక్​ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలు త్రైపాక్షిక భద్రతా కూటమిని(aukus alliance) ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం గల జలాంతర్గాములను అభివృద్ధి చేసే సాంకేతికతను అమెరికా, యూకేలు అందించనున్నాయి. ఈ కూటమిని సెప్టెంబర్​ 15న మూడు దేశాల అధినేతలు ప్రకటించారు.

ఇదీ చూడండి:చైనాకు దీటుగా.. ఆ మూడు దేశాల కొత్త కూటమి

aukus pact: 'ఆకస్​' కూటమిపై చైనా- ఫ్రాన్స్​ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details