వాణిజ్యం, కరోనా వ్యాప్తి అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తోంది. తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ఎస్ఎంఐసీ)కి ఎగుమతులపై నిషేధం విధించింది.
తమ పరికరాలను చైనా మిలిటరీ ఉపయోగిస్తే ప్రమాదమని చెబుతూ అమెరికా వాణిజ్య శాఖ ఈ చర్యలు చేపట్టిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. కంప్యూటర్ చిప్‌ల దిగుమతిలో అమెరికాపై చైనా భారీగా ఆధారపడింది. గత రెండేళ్లలో సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చిప్‌లను దిగుమతి చేసుకుంది చైనా.