తాలిబన్ల చెరలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే.. తాలిబన్ల ఆక్రమణ అనంతరం.. అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికన్లకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ముప్పు పెరిగిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులను కాబూల్ విమానాశ్రయానికి తరలించేందుకు యూఎస్ భద్రతా దళం కొత్త మార్గాలను అన్వేషించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ మేరకు అమెరికా పౌరులను, అధికారులను రహస్యంగా తరలించే మార్గాలు భద్రతా దళాలు చెబుతున్నాయని అధికారి వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ అధికారి అనుమతి ఉంటేనే పౌరులు కాబూల్ విమానాశ్రయానికి వెళ్లాలని యూఎస్ దౌత్యకార్యాలయం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారి మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటివరకైతే ఐఎస్ గ్రూప్ పౌరులపై ఎలాంటి దాడిచేయలేదని అధికారి తెలిపారు. కానీ, వారి నుంచి ముప్పు ఉందన్న మాట మాత్రం వాస్తవేమనని స్పష్టం చేశారు.
బైడెన్ స్పందన...