కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా ఔషధ తయారీ సంస్ధ ఫైజర్, జర్మనీ సంస్ధ బయో ఎన్‌టెక్ రూపొందించిన టీకా సురక్షితమైనదే అని అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా సంస్ధ (ఎఫ్‌డీఏ) తెలిపింది. ఈ మేరకు దానిపై పరీక్షలు నిర్వహించి, తమ విశ్లేషణను తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఉంచిన ఈ సంస్ధ.. కరోనా నుంచి ఈ వ్యాక్సిన్ బలంగా కాపాడుతుందని తెలిపింది.
ఈ వ్యాక్సిన్‌పై నిపుణులతో మరింత లోతుగా చర్చించిన తర్వాత వినియోగం కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ఎఫ్‌డీఏ వెల్లడించింది. వినియోగం కోసం అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్‌ను ఆరోగ్య సిబ్బంది, ఇంటివద్ద ఉండి వైద్య చికిత్స పొందతున్న వారికి అందజేస్తామని వెల్లడించింది.