అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గినట్టే కనిపించినా అగ్రరాజ్యంలో కొవిడ్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వరుసగా రెండోరోజు 1000కి పైగా కొవిడ్ మరణాలు సంభవించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మంగళవారం 1100లకు పైగా మరణాలు నమోదవ్వగా.. బుధవారం కూడా దాదాపు అదే స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. మే 29 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మళ్లీ మరణాలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
అంత్యక్రియలకు వెయిటింగ్ లిస్ట్!
టెక్సాస్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. వారం వ్యవధిలోనే మరణాలు రెట్టింపు కావడం వల్ల మృతదేహాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వచేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.