ప్రపంచవ్యాప్తంగా కరోనా మరింతగా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 13 లక్షల 49 వేలు దాటింది. కేసులు 5 కోట్ల 62 లక్షలపైనే. అమెరికాలో తొలి దశ కంటే ఇప్పుడు బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. మరణాలు 2 లక్షల 50 వేల మార్కును అధిగమించాయి.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. యూఎస్‌లో కోటీ 15 లక్షల కరోనా కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇక్కడే అధికం.
కరోనాతో ప్రతి నిమిషానికీ అమెరికాలో ఒకరు చనిపోతున్నారని సీఎన్ఎన్ వార్తాసంస్థ నివేదించింది. ఈ లెక్కన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.జొనాథన్ రీనర్ హెచ్చరించారు.