తెలంగాణ

telangana

ETV Bharat / international

'రష్యాపై నమ్మకం లేదు.. ఉక్రెయిన్‌పై దాడి జరగొచ్చు' - ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ సన్నాహాలు

Ukraine russia conflict: ఉక్రెయిన్​పై రష్యా బలగాలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. రష్యా యుద్ధానికి దిగితే స్వయంగా గాయం చేసుకున్నట్లే అవుతుందని రష్యా అధ్యక్షుడిని జో బైడన్‌ ఘాటుగా హెచ్చరించారు.

biden
బైడెన్​

By

Published : Feb 16, 2022, 11:03 AM IST

Ukraine russia conflict: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. కొందరు సైనికుల్ని వెనక్కి పిలిచామని, చర్చలకు సిద్ధంగానే ఉన్నామని రష్యా అధినేత పుతిన్ చెప్పినప్పటికీ అమెరికా పూర్తిగా విశ్వసించడంలేదు. యుద్ధానికి దిగితే స్వయంగా గాయం చేసుకున్నట్లే అవుతుందని రష్యా అధ్యక్షుడిని జో బైడన్‌ ఘాటుగా హెచ్చరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగితే అమెరికా, మిత్రపక్షాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని బైడెన్‌ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఇంకా లక్షన్నర రష్యా బలగాలు ఉన్నాయన్న అగ్రరాజ్యాధినేత దౌత్యపరమైన మార్గాలు తెరిచే ఉన్నట్లుచెప్పారు.

ఉక్రెయిన్‌పై దాడి వార్తలను పదేపదే ఖండిస్తున్న రష్యా ఆ దేశాన్ని నాటోలో చేర్చుకోరాదని డిమాండ్ చేస్తోంది. గతంలో సోవియట్‌ యూనియన్ దేశాల నుంచి తమ బలగాలు వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని నాటో దేశాలను కోరుతోంది.

ఇదీ చూడండి:

Ukraine russia news: 'మేం యుద్ధాన్ని కోరుకోవడంలేదు'

ABOUT THE AUTHOR

...view details