తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​1బీ వీసాలకు ఈసారీ మంచి గిరాకీ

హెచ్​1బీ వీసాల కోసం అమెరికా కాంగ్రెస్ సూచించిన పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయని యూఎస్​ఐసీఎస్​ వెల్లడించింది. అనర్హుల వీసా దరఖాస్తులు తిరస్కరించి, రుసుమును తిరిగి పంపిస్తామని చెప్పింది.

65 వేల హెచ్​1బీ వీసాలకు దరఖాస్తులు పూర్తి

By

Published : Apr 6, 2019, 6:44 PM IST

హెచ్​1బీ వీసాల కోసం ఈ ఏడాదీ దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే పరిమితికి మించి వీసా దరఖాస్తుల కోసం పిటిషన్లు వచ్చాయి.

2019-20 ఆర్థిక సంవత్సరానికి 65వేల హెచ్​1బీ వీసాలు జారీ చేయాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ-యూఎస్​ఐసీఎస్​ ప్రక్రియ ప్రారంభించింది. హెచ్​1బీ వీసాల దరఖాస్తులు జారీచేసేందుకు ఈనెల 1న పిటిషన్లు స్వీకరించడం ప్రారంభించింది.

ఐదు రోజుల్లోనే దరఖాస్తుల కోసం పరిమితికి మించి పిటిషన్లు వచ్చాయని యూఎస్​ఐసీఎస్​ ప్రకటించింది. అయితే ఆ సంఖ్య ఎంతో చెప్పలేదు. అనర్హుల పిటిషన్లు తిరస్కరించి, రుసుము తిరిగి పంపిస్తామని స్పష్టంచేసింది.

అడ్వాన్స్​డ్​ కోసం మరో లెక్క...

అమెరికా అడ్వాన్స్​డ్​ డిగ్రీ కోటాలో మరో 20వేల హెచ్​1బీ వీసాలు ఇచ్చేందుకు వీలుంది. అందుకు సరిపడా పిటిషన్లు వచ్చాయో లేదో పరిశీలిస్తామని చెప్పింది యూఎస్​ఐసీఎస్​.

ఆమోదం తర్వాతే దరఖాస్తు...

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్​-1బీ వీసా తప్పనిసరి. ఇందుకోసం ముందుగా 'యూఎస్‌సీఐఎస్‌'లో పిటిషన్‌ దాఖలు చేయాలి. అది ఆమోదం పొందిన తరువాతే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎప్పుడూ లక్షల్లోనే...

2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి ఐదు రోజుల్లో అందిన పిటిషన్ల వివరాలు తెలిపారు యూఎస్‌సీఐఎస్‌ అధికారులు. ఈ ఏడాది అందిన పిటిషన్ల వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఆర్థిక ఏడాది పిటిషన్ల సంఖ్య

1. 2018-19 1,90,000

2. 2017-18 1,99,000

3. 2016-17 2,36,000

4. 2015-16 2,32,972

5. 2014-15 1,72,581

ABOUT THE AUTHOR

...view details