తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో తుపాను బీభత్సం.. భయం గుప్పిట్లో ప్రజలు! - US Louisiana storm

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర ఫ్లోరిడాలో వీస్తోన్న భయంకరమైన గాలులకు చాలా వరకు విద్యుత్​ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఈ తుపాను మరింతగా విజృంభించే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

US: Rain, road flooding as Tropical Storm Cristobal draws closer
అమెరికాలో తుపాను బీభత్సం.. భయం గుప్పిట్లో ప్రజలు!

By

Published : Jun 8, 2020, 12:06 PM IST

అమెరికా- లూసియానాలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన తుపానుతో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను ప్రభావంతో ఉత్తర ఫ్లోరిడాలో బీభత్సమైన గాలులు వీచాయి. ఈ దెబ్బకు విద్యుత్​ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా ఎక్కడిక్కడే వాహనాలను నిలిపివేసిన అధికారులు.. ప్రవాహ ఉద్ధృతి తగ్గేవరకు పడవల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లుచేశారు.

గాలుల తాకిడికి కూలిన ఇల్లు
స్తంభించిన రవాణా
విరిగిపడ్డ చెట్లు

తుపాను తాకిడితో మిసిసిపీ నదీ సమీపం, గ్రాండ్​ ఐసిల్​ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. క్రిస్టబల్​ నదీ తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావంతో.. గంటకు 50 మైళ్ల(85 కిలోమీటర్ల) వేగంతో గాలులు వీచాయి. అయితే ఈ వేగం మరింత పెరిగి గంటకు దాదాపు 180 మైళ్ల(290 కిలోమీటర్లు)కు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇంట్లోకి చేరిన వరద నీరు

లూసియానా, మిసిసిపీ పరిసర ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ప్రవాహం ఎత్తు 5 అడుగులు దాటింది.

వరదనీటి ఉద్ధృతి

ఇదీ చదవండి:జాతి వివక్షపై గొంతెత్తిన ప్రపంచం.. పలు దేశాల్లో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details