హెచ్1బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హెచ్1బీ పరిధిలోకి వచ్చే విదేశీ నిపుణులకు తాత్కాలిక వ్యాపార వీసాలను జారీ చేయకూడదని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత నిబంధనలు సవరించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది.
అమెరికాలో విధులను పూర్తిచేయడానికి గానూ సంస్థలు తమ సాంకేతిక నిపుణులను యూఎస్‌కు పంపేందుకు, వారు అక్కడ తాత్కాలికంగా ఉండేందుకు ప్రస్తుత విధానం వీలు కల్పిస్తోంది.
"ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే హెచ్ పాలసీకి బదులుగా బీ-1 ద్వారా విదేశీ నిపుణులు దేశంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ప్రతిపాదిత మార్పులు, దాని ఫలితంగా వచ్చే పారదర్శకత హెచ్-1బీ వీసాదారుల ద్వారా అమెరికా ఉద్యోగులపై పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది. నిబంధనల్లో మార్పుతో దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుంది."
- అమెరికా విదేశాంగ శాఖ.