తెలంగాణ

telangana

ETV Bharat / international

దూకుడు, తెంపరితనం కలబోస్తే ట్రంప్! - డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితం

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు. దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం. అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం. ఆయనెవరో కాదు డొనాల్డ్ ట్రంప్. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు తలెత్తినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు. అదే దూకుడు, అదే వ్యవహార శైలి.

Trump: Know most controversial prez in American history
ట్రంప్

By

Published : Nov 3, 2020, 1:33 PM IST

రెండు వందలేళ్ల అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని, ఎన్నడూ వినని, ఎవరితో పొంతనలేని అధ్యక్షుడెవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే! దూకుడైన వ్యక్తిత్వం, అమెరికా ముందు ప్రపంచ వేదికైనా బేఖాతరు అనుకొనే స్వభావం, అన్నింటికీ మించి అత్యంత వివాదాస్పద వైఖరి ఆయన్ను అందరితో పోలిస్తే భిన్నంగా ఉండేలా చేశాయి.

బాల్యం-విద్యభ్యాసం

ముక్కుసూటి

ట్రంప్ ఏదైనా బహిరంగంగా చెప్పేస్తారు. దాపరికాలు అసలే ఉండవు. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం ఆయనది. కానీ తన రాజకీయ జీవితానికి ఇవే పెద్ద శత్రువులు. ఈ స్వభావం వల్లే.. ట్రంప్ తప్పు అని నిరూపించే విధంగా ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తుంటారు.

ట్రంప్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన సంపాదించిన గుర్తింపు.. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను పక్కనపెట్టేలా చేసి, అమెరికా ఎన్నికల సరళిని మార్చింది.

సిసలైన వ్యాపారవేత్త

వివాదాల రారాజు!

ట్రంప్​ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ప్రతి విషయంలో ప్రత్యర్థుల కంటే మిన్నగా తనను తాను సమర్థించుకున్నారు. ఇందులోనూ రక్షణాత్మక వైఖరి కంటే దూకుడు విధానమే అనుసరించారు. ఆయనపై ప్రయోగించిన అభిశంసన తీర్మానం సహా తాజా కరోనా వ్యవహారం వరకు ప్రతి విషయంలో ఆయనపై వేలెత్తి చూపించిన సంఘటనలు ఉన్నాయి. అయినా ట్రంప్ స్వభావాన్ని, ఇమేజ్​ను మార్చుకున్న దాఖలాలు లేవు.

ముచ్చటగా మూడు

ఎప్పుడూ విజేతే!

కొన్ని మినహాయింపులు ఇస్తే ట్రంప్ అన్నింటిలోనూ విజేతగానే నిలిచారు. అన్ని వివాదాల నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. ఇలా వివాదాల నుంచి బయటపడటం వల్ల ఆయన ఉనికి మరింత బలంగా మారింది.

చైనాతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ అధికంగా ఆసక్తి చూపించారు. సుంకాలు పెంచడం, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గించడం వంటి ప్రయత్నాలు చేశారు. దీంతో చైనాకు తీవ్ర నష్టం వాటిల్లింది. అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరించే ట్రంప్​కు ఇది మేలు చేసే విషయం.

డెమొక్రాట్లు తీసుకొచ్చిన అభిశంసనలోనూ ఇదే జరిగింది. తీర్మానం వీగిపోయింది. దీంతో పదవిలో ఉన్న తనకు మరింత ఉత్సాహం లభించింది. ఈ ఏడాది సెనేట్​లో ట్రంప్ ఇచ్చిన ప్రసంగంలోనే ఈ విషయం స్పష్టమైంది.

ట్రంప్ ఖాతాలో చేరని విజయం... ఉత్తర కొరియా వివాదం. కిమ్ జోంగ్ ఉన్ చేపట్టిన అణ్వస్త్ర కార్యక్రమాలు మాన్పించేలా చేయలేకపోయారు. రెండు సార్లు కిమ్​తో భేటీ అయినప్పటికీ చివరకు ఇవన్నీ విఫల యత్నాలుగా మిగిలిపోయాయి.

సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కొని...

దూకుడైన వ్యక్తిత్వం

సవాళ్లను అవకాశంగా మార్చుకోవడంలో డొనాల్డ్ ట్రంప్​ది అందెవేసిన చెయ్యి. ప్రత్యర్థుల నిగూఢ రహస్యాలను కనుగొని బయటపెట్టడంలో ఆయన శైలి వేరు. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అయినా, బరాక్ ఒబామా అయినా, లేదా తాజా ప్రత్యర్థి జో బైడెన్ అయినా... దూకుడుగా దంచేయడమే ట్రంప్ అసలైన స్టైల్.

సహ రచయితగా కలం పట్టి రాసిన పుస్తకాలు

రాజకీయాల్లో...

2016లో అధ్యక్ష పదవి రేసులోకి రావడం, విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టడం, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి రికార్డు స్థాయిలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం... ఇవన్నీ ట్రంప్​కే చెల్లాయి. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ ఎన్నికల రణరంగంలోకి దూకారు.

వెలుగులీనుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, నేరాలపై తన యంత్రాంగం చూపిన మెరుగైన పనితీరుపైనే తన గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు ట్రంప్.

అయితే ఆది నుంచి ట్రంప్ యంత్రాంగం ఏదో సవాలును ఎదుర్కొంటూనే ఉంది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది సమయానికే దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. 2017 జనవరిలో వీటి దృష్టి మళ్లిస్తూ మెక్సికో గోడ నిర్మాణ ప్రతిపాదన చేశారు. ఆ దేశంపై ప్రయాణ ఆంక్షలు విధించారు. తర్వాత అంతర్జాతీయంగానూ వివిధ నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. అయితే దేశంలో సాధించిన విజయాలపైనే ఆయన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.

భిన్నధ్రువాలు

ప్రపంచం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్, బైడెన్ పోటీ పడుతున్నారు. కరోనా పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరే ప్రత్యర్థి బైడెన్​కు ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారిపోయింది.

బైడెన్, ట్రంప్ ఇద్దరిదీ పూర్తి భిన్నమైన దారి. వైద్యం, విదేశాంగ విధానం, వాతావరణ మార్పులు వంటి విషయాల్లో ఇద్దరి వైఖరులు వేరు. తన ప్రత్యర్థి.. 77 ఏళ్ల జో బైడెన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో ఎక్కువ వయసు కలిగిన ప్రధాన పార్టీ నామినీగా రికార్డులకెక్కారు. తన జీవితంలో చాలా భాగం ప్రజాప్రతినిధిగా సేవలందించారు. ఏ నామినీకి ఇంతటి అనుభవం లేదు. కానీ, బైడెన్ తన జీవితంలో ఎన్నడూ చూడని సంక్షుభిత పరిస్థితు ప్రస్తుతం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా.. ఈ పరిణామాలను విస్మరించలేని పరిస్థితి నెలకొన్న విషయం కాదనలేని వాస్తవం..!

ABOUT THE AUTHOR

...view details