తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు బైడెన్​ కే! - Donald Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు విడుదల చేయగా.. తాజాగా సీబీఎస్​ న్యూస్​ ఓ సర్వేను విడుదల చేసింది. దీనిలో ఫ్లోరిడా రాష్ట్రంలో 50-48 శాతం, నార్త్​ కరోలినా రాష్ట్రంలో 51-47 శాతంతో ట్రంప్​పై బైడెన్​ పైచేయి సాధించవచ్చని తేలింది.

Biden leads in battleground states of Florida, N Carolina
ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు బైడెన్​ కే!

By

Published : Oct 26, 2020, 10:06 PM IST

అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​, రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ మధ్య హోరాహోరిగా పోటీ నెలకొంది. ఈ మేరకు సీబీఎస్​ న్యూస్​ ట్రాకర్​ పోల్ సర్వేను విడుదల చేసింది. అయితే ఫ్లోరిడా, నార్త్​ కరోలినా రాష్ట్రాల్లో బైడెన్​కే ఎక్కువ ప్రజా మద్దతు ఉన్నట్లు తేలింది.

ఫ్లోరిడాలో 50-48 శాతంతో ప్రజలు ట్రంప్​ కన్నా బైడెన్​ వైపే సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో ట్రంప్ ఇక్కడ​ 49.02శాతంతో గెలుపొందగా... అప్పటి డెమోక్రటిక్​ అభ్యర్థి హిల్లరి క్లింటన్​కు 47.82 శాతం ఓట్లు వచ్చాయి.​

నార్త్​ కరోలినా రాష్ట్రంలో కూడా బైడెన్​కు ఓటు వేసేందుకు ప్రజలు మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది. 51-47 శాతంతో బైడెన్​ ముందంజలో ఉన్నట్లు తేలింది. అయితే 2016 ఎన్నికల్లో 49.83 శాతం ఓట్లతో ట్రంప్​ ఇక్కడ పైచేయి సాధించారు​. ప్రత్యర్థి క్లింటన్​ 46.17శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు.

ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే 61శాతం ముందుస్తు ఓటింగ్​ పూర్తవగా.. వారంతా బైడెన్​కే ఓటు వేసినట్లు సర్వేలో తేలింది.

ఇదీ చూడండి:ట్రంప్​- బైడెన్​ గ్రాఫ్​లో మార్పు... తేడా 4 పాయింట్లే!

ABOUT THE AUTHOR

...view details