తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశానికి ట్రంప్​! - TRUMP LATEST NEWS

ఈ ఏడాది ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలు కరోనా కారణంతో పూర్తిగా ఆన్​లైన్​కు మారిపోయాయి. అయితే సెప్టెంబర్​లో జరగనున్న ఈ సెషన్​లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా పాల్గొనే అవకాశముంది. ఇందుకోసం ఆయన న్యూయార్క్​ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఐరాస అసెంబ్లీ సమావేశానికి భౌతికంగా హాజరయ్యే నేత ట్రంప్​ కానున్నారు.

US President Trump likely to be only world leader to address UN General Assembly session in person
ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశానికి ట్రంప్​!

By

Published : Jul 31, 2020, 3:39 PM IST

కరోనా సంక్షోభంతో అంతర్జాతీయ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్​వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ కూడా వర్చువల్​గానే జరగనుంది. అయితే న్యూయార్క్​లో జరగనున్న ఈ సెషన్​కు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భౌతికంగా హాజరై ప్రపంచ నేతలనుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్​ వెల్లడించారు. ఇదే జరిగితే ఈ ఏడాది సర్వసభ్య సమావేశంలో నేరుగా పాల్గొననున్న ఏకైక నేత ట్రంప్​ కానున్నారు.

ఈ ఏడాది ఐరాస 75ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆన్​లైన్​ వేదికగా సాధారణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రపంచ నేతలందరూ ముందుగానే వీడియోలు రికార్డు చేసి ఐరాసకు సమర్పించనున్నారు.

ఐరాస అమెరికాలో ఉండటం వల్ల సెప్టెంబర్​ 22న జరగనున్న 75వ సర్వసభ్య సమావేశానికి ట్రంప్​ హాజరయ్యే అవకాశాలు ఎక్కువ. నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్​నకు తొలి దఫా అధ్యక్ష పదవిలో ఇదే చివరి ప్రసంగం కానుంది.

ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?

ABOUT THE AUTHOR

...view details