Biden approval rating: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన నేపథ్యంలో ఆసక్తికరమైన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్‌ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ గ్రాఫ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్-ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి.
AP NORC poll Joe Biden
అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని జో బైడెన్‌కు 43 శాతం మంది మాత్రమే ఓటేశారు. జులైలో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో 59 శాతం బైడెన్ అధ్యక్ష బాధ్యతలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఇది 50 శాతంగా ఉంది.
Joe Biden covid response
కరోనా నియంత్రణలోనూ బైడెన్ పనితీరుపై అనేక మంది నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. 45 శాతం మంది మాత్రమే కరోనాపై బైడెన్ పనితీరు సంతృప్తికరంగా స్పందించారు. 2021 జులైలో 66 శాతం, డిసెంబర్లో 57 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
Biden re election chances
2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉంటారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, 50 శాతం మంది మాత్రం.. బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండలేరని అభిప్రాయపడ్డారు.