తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..! - ట్రంప్ కరోనా డిశ్ఛార్జి

కొవిడ్-19 గురించి తనకు పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిజమైన పాఠశాలలో కరోనా గురించి తెలుసుకున్నానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్​లో వీడియో పోస్ట్ చేశారు. సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు.. అభిమానుల కోసం బయటకు వచ్చారు. చాలా రోజుల తర్వాత ట్రంప్ మళ్లీ​ మాస్కులో దర్శనమిచ్చారు.

us president Donald Trump
ట్రంప్​కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..!

By

Published : Oct 5, 2020, 7:31 AM IST

Updated : Oct 5, 2020, 8:29 AM IST

కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను సోమవారం డిశ్ఛార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆయన.. తన కోసం వచ్చిన అభిమానులను చూసేందుకు ఆదివారం బయటకు వచ్చారు. అందరికీ అభివాదం చేసుకుంటూ కాన్వాయ్​లో ముందుకు సాగారు. ఎప్పుడూ మాస్కు లేకుండా ప్రచారాలు, భారీ బహిరంగ సభలకు హాజరైన ఆయన కారులో సైతం మాస్కు ధరించి కనిపించారు​.

అంతకుముందు కొవిడ్-19 గురించి తనకు పూర్తిగా అర్థమైందని పేర్కొంటూ ట్విట్టర్​లో వీడియోను పోస్టు చేశారు అమెరికా అధ్యక్షుడు. నిజమైన పాఠశాలలో కరోనా గురించి పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు.

ఇదీ చూడండి: ట్రంప్‌ నిజంగా ఒక ఫూల్‌: జో బిడెన్‌

Last Updated : Oct 5, 2020, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details