తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దంపతులకు కరోనా ​ - US President Donald Trump

US President Donald Trump and First Lady Melania Trump test positive for #COVID19.
డొనాల్డ్​ ట్రంప్​నకు కరోనా...

By

Published : Oct 2, 2020, 10:31 AM IST

Updated : Oct 2, 2020, 11:56 AM IST

10:40 October 02

కరోనా సోకిందని ట్రంప్​ ట్వీట్​

డొనాల్డ్​ ట్రంప్​నకు కరోనా...

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రస్తుత ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కరోనా బారినపడ్డారు. ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​నకూ కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు డొనాల్డ్​. 

అంతకుముందు ట్రంప్​ ముఖ్య సలహాదారుల్లో ఒకరైన హోప్​ హిక్స్​కు కరోనా సోకగా.. తామూ పరీక్షలు చేయించుకున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు. కాసేపటికే ఫలితాలు వచ్చాయని, ఇద్దరికీ పాజిటివ్​గా తేలిందని మరో ట్వీట్​ చేశారు. తక్షణమే క్వారంటైన్​కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు కరోనా బారినపడటం వల్ల ట్రంప్​ ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. 

క్వారంటైన్​కు వెళుతున్నట్లు తెలిపిన మెలానియా ట్రంప్... తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసిన అమెరికా ప్రథమ మహిళ.. అందరూ సురక్షితంగా ఉండాలని సూచించారు. 

త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్​...

కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్​ దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్​ చేశారు. 

10:29 October 02

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దంపతులకు కరోనా ​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ దంపతులకు కరోనా పాజిటివ్​గా తేలింది. ట్రంప్​ సలహాదారు హాప్​ హిక్స్​కు కరోనా సోకిన అనంతరం.. ఇరువురూ పరీక్షలు చేయించుకోగా వైరస్​ నిర్ధరణ అయింది. 

Last Updated : Oct 2, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details